తల్లాడ: గ్రామ సభలను సద్వినియోగం చేసుకోండి
తల్లాడ మండలంలో ఈనెల 21 నుంచి 23 వరకు అన్ని గ్రామ పంచాయతీలలో నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో చంద్రమౌళి తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాల్లో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేసి, నివేదికను ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.