ఖమ్మం జిల్లాలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగదారులకు నాణ్యమైన భోజనం అందించాలని జాతీయ వినియోగదారుల హక్కు కమిషన్ జిల్లా ఛైర్మన్ కంటే కేశవ్ గౌడ్ పేర్కొన్నారు. గురువారం సత్తుపల్లిలోని పలు హోటల్, రెస్టారెంట్లను ఆయన తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలన్నారు. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన పదార్థాలను ప్రజలకు పెట్టొద్దన్నారు. పలు హోటల్లో కల్తీ జరుగుతుందని అన్నారు.