దళితుల అభ్యున్నతి కోసం అందరు కలిసికట్టుగా పోరాటం చేయాలని దళిత సమైఖ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ అన్నారు. ఆదివారం సత్తుపల్లి కళాభారతి ఆడిటోరియంలో దళిత సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ఆయన మాట్లాడారు. అనంతరం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాంబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి చిన్ని, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధర్మరాజు, నాయకుడు బోస్, పాల్గొన్నారు.