కోదండరామ్, అమీర్ అలీఖాన్ శుక్రవారం ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారిలో ప్రమాణం చేయించారు. దాంతో వీరు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.