AP: సంక్రాంతి పండుగలో భాగం నిర్వహించిన కోడి పందేలలో ఓ కోడి పుంజు ఏకంగా ఏడు పందేలు గెలిచింది. ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం ఎస్సార్ బంక్ సమీపంలో ఏర్పాటు చేసి కోడి పందేలలో ఈ కోడి తన సత్తా చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ 7 పందేలు గెలిచి చివరికి ఒక కన్నును కోల్పోయింది. ఈ ఏడాది 7 పందేలు గెలవడంపై ఆ కోడి పుంజు యజమాని సంతోషం వ్యక్తం చేశారు.