ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డును టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ట్రోఫీ, క్యాప్‌ను ICC ఆయనకు బహూకరించింది. కాగా కోహ్లీ 2023లో వన్డేల్లో అదరగొట్టారు. 27 మ్యాచ్‌లు ఆడి 72.47 యావరేజ్‌తో 1,377 పరుగులు చేశారు. ఇందులో 6 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆ ఏడాదిలో కోహ్లీ అత్యుత్తమ స్కోరు 166*. వన్డే WCలో ఏకంగా 11 మ్యాచుల్లోనే 765 పరుగులు బాదారు.