ఏపీలో వచ్చే నెల నుంచి నూతన మద్యం పాలసీ రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు టాప్ బ్రాండ్‌లకు సంబంధించిన మద్యం ఏపీకి చేరిందని కథనాలొస్తున్నాయి. అన్నీ సక్రమంగా జరిగి కొత్త మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యం అందుబాటులోకి రావాలంటే అక్టోబరు 4వ తేదీ వరకూ సమయం పట్టొచ్చని అంటున్నారు. ఈ సమయంలో ప్రస్తుతానికి ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాల వల్ల మందుబాబులకు కొత్త కష్టం వచ్చిందని అంటున్నారు. చాలా మద్యం దుకాణాల్లో "స్టాకు లేదు" అనే బోర్డులు దర్శనమిస్తున్నాయంట.