నౌకాదళంలో చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. చైనా నిర్మిస్తున్న న్యూక్లియర్ సబ్‌మెరైన్ సముద్రంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. శాటిలైట్ ఫొటోల ప్రకారం మార్చ్-10న వ్యూహాన్ సమీపంలోని షిప్‌యార్డులో ఈ సబ్‌మెరైన్ నిలిపి ఉంచింది. ఆ తర్వాత జూన్‌లో తీసిన ఫొటోల్లో జలాంతర్గామి తిరిగి రాలేదని, మనిగిపోయిన విషయాన్ని దాచేందుకు చైనా ప్రయత్నిస్తుందని యూఎస్ రక్షణశాఖ అధికారి పేర్కొన్నారు.