కోల్‌కతా రేప్ కేసు.. సుప్రీంకోర్టులో మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్

79చూసినవారు
కోల్‌కతా రేప్ కేసు.. సుప్రీంకోర్టులో మృతురాలి తల్లిదండ్రుల పిటిషన్
దేశ వ్యాప్తంగా సంచలనం రేసిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు పశ్చిమబెంగాల్ లోని సీల్దా కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే సీల్దా కోర్టు ఇచ్చిన తీర్పును మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దోషికి ఉరిశిక్ష విధించాలని కోరుతూ అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేయగా ఈనెల 29న విచారించనుంది.

సంబంధిత పోస్ట్