బెజ్జూర్: గల్లంతైన యువకులలో ఒకరి మృతదేహం లభ్యం
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం సోమిని ఎర్రబండ ప్రాంతాల్లో శనివారం నలుగురు యువకులు సరదాగా ఈతకు వెళ్లగా ముగ్గురు గల్లంతు అయిన విషయం తెలిసిందే. నిన్నటి నుండి వెతుకగా ఆదివారం ఉదయం తలాయి వద్ద ప్రాణహిత నదిలో జాహీర్ మృతదేహం లభ్యం అయ్యింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.