తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన ఐఏఎస్ లకు కూటమి ప్రభుత్వం తాజాగా పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైద్యారోగ్య కమిషనర్‌గా వాకాటి కరుణ, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తెలంగాణ నుంచి వెళ్లిన ఐఏఎస్ రోనాల్డ్ రాస్కు ఇంకా ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం.