బెజ్జూర్: పాము కాటుతో వ్యక్తి మృతి
బెజ్జూర్ మండలం సోమిని గ్రామానికి చెందిన జనగం జీవన్ దాస్(21) బుధవారం పొలానికి వెళ్లి పొలం పని చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన పాము కాటేసింది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా తనకు పాము కాటేసింది రాలేకపోతున్నట్లు తెలిపి స్పృహ కోల్పోయాడు. కుటుంబ సభ్యులు పొలానికి చేరుకొని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.