సిబ్బంది నిర్లక్ష్యం.. పసికందు మృతి
AP: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జిల్లా ఆస్పత్రిలో పసికందు మృతితో బాధిత కుటుంబం నిరసనకు దిగింది. నందిగాం మండలం కైజోల గ్రామానికి చెందిన పడ్డ శ్రావణి డెలివరీ కోసం జిల్లా ఆస్పత్రిలో చేరారు. రాత్రి నుంచి ఆమెకు పురిటినొప్పు మొదలయ్యాయి. బుధవారం ఉదయం వైద్యులు కాన్పు చేశారు. అయితే ఊపిరాడక బిడ్డ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు.