బీహార్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఆయనకు 8 రోజుల పాటు మెటర్నిటీ లీవ్‌లను విద్యాశాఖ మంజూరు చేయడంతో సదరు టీచర్ ఆ సెలవులను వాడుకున్నాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని, దీనిపై దర్యాప్తు చేస్తామని అధికారులు వెల్లడించారు.