బెజ్జూర్ మండలం దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బీట్ అధికారులు సోమవారం క్షేత్ర పర్యటనలో భాగంగా సిర్పూర్ మండలంలోని ఇటిక్యాలపహాడ్ గ్రామంలో ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. ట్రైనీలకు కోర్టు డైరెక్టర్ రామ్మోహన్ అటవీ ప్రాంతంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, సంరక్షణ చర్యలు, టైగర్ ట్రాకింగ్ చేస్తున్న విధానాన్ని, వన్యజీవుల సంరక్షణలో ఎదురయ్యే సవాళ్లను, వాటిని పరిరక్షిస్తున్న తీరును వివరించారు.