బీజేపీలో ‘అల్లు’కుంటున్న వివాదం.. సీఎం రేవంత్ ను సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే

66చూసినవారు
అల్లు అర్జున్, సీఎం రేవంత్ ఎపిసోడ్‌పై ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ స్పందించారు. బన్నీ అరెస్టును కూటమి నేతలు తప్పుపడుతుండగా ఆయన మాత్రం సీఎం రేవంత్ నిర్ణయాన్ని సమర్ధించారు. 'బెనిఫిట్ షోలు ఆపకూడదని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కానీ టికెట్ రేట్లు పెంచడం, తొక్కిసలాటలు జరగకుండా అలాంటి షోలు ఆపేయాలి. బన్నీ అరెస్టు కక్షపూరితమని కిషన్ రెడ్డి, పురందీశ్వరి అనుకోవచ్చు. కానీ CM రేవంత్ బ్రహ్మాండంగా చేశాడు' అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్