గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. ప్రతి రోజూ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆదేశించింది. బయోమెట్రిక్ ఆధారిత వేతన బిల్లులనే నమోదు చేయాలని అధికారులకు సూచించింది. అలాగే విజన్ డాక్యుమెంట్-2047 ఫ్రేమ్ వర్క్ బాధ్యతల్లోనూ పాలుపంచుకోవాలని పేర్కొంది. దీనిపై సీఎం చంద్రబాబు ప్రతి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తారని, ఆ సమీక్షలోనూ పాల్గొనాలని సూచించింది.