AP: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. బుధవారం ఈ అల్పపీడనం బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇవాళ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయంది. కాగా, ఇంకో 2 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.