భారత మహిళల నెం.1 చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి నార్వే చెస్ వుమెన్-2025 బరిలో దిగనున్నారు. వరల్డ్ క్లాసికల్ చెస్‌లో ఆరో స్థానంలో ఉన్న హంపి గతేడాది మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ గెలుచుకుని సత్తా చాటారు. దీనిపై హంపి స్పందించారు. ‘ప్రతిష్టాత్మక నార్వే చెస్ వుమెన్ టోర్నమెంట్ ఆడటం గౌరవంగా భావిస్తున్నా’ అని హంపి తెలిపారు.