సభలో రామ్మోహన్నాయుడికి దాహం.. మంచినీళ్లు ఇచ్చిన సుధామూర్తి
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. కేంద్ర పౌరవిమానయానమంత్రి రామ్మోహన్నాయుడు గురువారం రాజ్యసభలో వాయు యాన్ విధేయక్ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ దాహానికి గురయ్యారు. వెంటనే రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి తన వద్ద ఉన్న మంచినీళ్ల సీసాను తెచ్చి రామ్మోహన్నాయుడికి అందించారు. ఆమెకు రెండుచేతులతో నమస్కరించి, ఆమె ఎప్పుడూ తల్లిలా ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు రామ్మోహన్నాయుడు తెలిపారు.