AP: శుక్రవారం నుంచి రాష్ట్రంలోని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 8 వరకు 17,564 గ్రామాల్లో ఈ సదస్సులు కొనసాగుతాయి. భూముల రికార్డులను అప్‌డేట్ చేసేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులు ప్రజల వద్దకే వెళ్లి భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు అన్ని పూర్తి చేశారు.