వినాయకుడి నిమజ్జనం వెనుక ఉన్న రహస్యం ఇదే
వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేయడం వెనుక ఓ రహస్యం ఉంది. వినాయక చవితికి భక్తుల పూజలు అందుకున్న గణేషుడు వారి కోర్కెలు తీర్చడానికి భూమిపైకి వస్తాడట. గణపతిని తిరిగి స్వర్గానికి పంపించడానికి సముద్రమే దగ్గరి మార్గం. అందువలన గణపతి విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేస్తారట. అంతేగాకుండా విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి, పత్రి, గరిక వంటి 21 రకాల ఇతర వస్తువుల వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలన్నీ మరణిస్తాయి. దీంతో నీరు శుభ్రంగా మారుతుంది.