మూడు పురుషాంగాలతో 78 ఏళ్లు జీవించిన వ్యక్తి
మూడు పురుషాంగాలతో ఓ వ్యక్తి 78 ఏళ్లు జీవించినట్టు UKలోని బర్మింగ్హామ్ మెడికల్ స్కూల్కు చెందిన వైద్య విద్యార్థులు గుర్తించారు. 78 ఏళ్ల సదరు వ్యక్తి మరణించిన తర్వాత తన మృతదేహాన్ని పరిశోధనలకు దానంగా ఇచ్చారు. ఆయన మృతదేహంపై పరిశోధనలు చేస్తున్న విద్యార్థులు అతడికి మూడు పురుషాంగాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ వ్యక్తికి ఒక పురుషాంగం బయటకు ఉండగా, రెండు పురుషాంగాలు బీజకోశంలో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.