కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటుకు ఆదిలోనే నిరసనలు మొదలైయ్యాయి. సుజాతనగర్ మండలంలోని 7 పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసే ప్రక్రియను వ్యతిరేకిస్తూ సోమవారం సుజాతనగర్ మండల కేంద్రంలో 7 గ్రామ పంచాయతీల ప్రజలు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్పొరేషన్ వద్దు, పల్లె ప్రాంతాలే ముద్దు అనే నినాదంతో కార్పొరేషన్ వ్యతిరేక నినాదాలు చేశారు.