
కొత్తగూడెం: ఏజెన్సీ చట్టాల అమలుకు కలెక్టర్ కు వినతి
ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ బహుళ అంతస్తులపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు ఆదివాసీ సంఘాల జేఏసీ, ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేయాలన్నారు. రెగ్యులేషన్ సమయంలో 1/70 నిబంధనలకు లోబడి మాత్రమే అనుమతులు ఇవ్వాలన్నారు. భవనం కూలిన ఘటనలో సహకరించిన వారిని శిక్షించాలన్నారు.