బూర్గంపాడు మండలం సారపాక మేడే కాలనీలో డ్రైనేజీ నిర్మాణం కోసం గుంతలను తవ్వి వదిలివేశారని. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంపై స్పందించిన అధికారులు సోమవారం డ్రైనేజీ పనులను ప్రారంభించారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులకు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.