బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన ఫిట్‌నెస్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. గోవాలో జరిగిన ‘ఐరన్ మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ ఛాలెంజ్’ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన 1.9 కి.మీ.ల స్విమ్మింగ్, 90 కి.మీ.లు సైక్లింగ్, 21.1 కి.మీ.ల రన్నింగ్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రధాని మోదీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఈవెంట్ కోసం తేజస్వి సూర్య దాదాపు 4 నెలల పాటు శ్రమించారు.