బూర్గంపాడు మండలం సారపాక పరిధిలో గల గాంధీ నగర్ లో సోమవారం దోమలు నివారణకు దోమల మందును స్ప్రేయింగ్ చేసే కార్యక్రమం చేపట్టినట్లు పంచాయతీ ఈవో మహేష్ తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పాటు ఎండావానలతో కూడిన విపరీత వాతావరణ పరిస్థితులు వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు తగుజాగ్రత్తల పాటించాలని సూచించారు.