సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ
హీరోయిన్ సమంతకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. 'నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే నా ఉద్దేశం. కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో ఎదిగిన మీరంటే నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను' అని సమంతకు ట్వీట్ చేశారు.