కామేపల్లి మండలం కొమ్మినేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అబ్బాస్ పురం గ్రామ నివాసి ధరావత్ కృష్ణ ప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. 2006 ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు సంతాపం తెలియజేసి వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించి రూ. 10వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భూక్యా నాగేంద్రబాబు, కానుగుల సత్యనారాయణ ధరావత్ రాము లవుడియా వీరభద్రం విన్నిబాబు శ్రీరామ్ సతీష్ పందుల వెంకటేశ్వర్లు గుగులోతు ఉపేందర్ రాజేష్ రాజశేఖర్ పాల్గొన్నారు.