ముంచుకొస్తున్న బర్డ్‌ఫ్లూ ముప్పు.. సైంటిస్టుల హెచ్చరిక!
అమెరికాలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వైరస్ జంతువుల్లో వ్యాప్తి చెందుతుందని.. దీని వ్యాప్తిని అడ్డుకోకపోతే ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ వైరస్ మనుషులకు సోకే అవకాశం లేదని చెబుతున్న శాస్త్రవేత్తలు.. ఒకవేళ మ్యుటేషన్ జరిగితే మాత్రం మానవాళిని కబలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు.