AP: చెక్ బౌన్స్ కేసులో హోంమంత్రి అనితకు భారీ ఊరట లభించింది. తన వద్ద తీసుకున్న రూ.70 లక్షలకు గానూ అనిత ఇచ్చిన చెక్కు చెల్లలేదని 2019లో వేగి శ్రీనివాసరావు అనే వ్యక్తి విశాఖ కోర్టులో ఫిర్యాదు చేశారు. కేసును రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని వీరిద్దరూ నిర్ణయానికి రాగా.. విశాఖ కోర్టులో ప్రొసీడింగ్స్ కొట్టేయాలని హోంమంత్రి అనిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం విచారణ జరగగా ఆమెపై ఉన్న కేసును కోర్టు కొట్టేసింది.