దివ్యాంగుల కేటగిరీలోనే భారీగా బోగస్ పింఛన్లు!

62చూసినవారు
దివ్యాంగుల కేటగిరీలోనే భారీగా బోగస్ పింఛన్లు!
AP: రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల కేటగిరీలో భారీగా అనర్హులు పింఛన్లు పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. సోమ, మంగళవారాల్లో జిల్లాకు ఒక గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో అధికారులు పింఛన్ల తనిఖీ చేపట్టిన విషయం తెలిసిందే. 11 వేల మంది పింఛన్‌దారుల వివరాలను పరిశీలించగా.. అందులో 450 మంది వరకు అనర్హులు ఉన్నట్లు తేల్చారు. అలాగే ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు పొందుతున్నట్లు బయటపడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్