2025లో ఐపీఓకి రానున్న జెప్టో

52చూసినవారు
2025లో ఐపీఓకి రానున్న జెప్టో
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో ఐపీఓకి రానుంది. ఈ విషయాన్ని సంస్థ కో- ఫౌండర్ ఆదిత్ పాలిచా తెలిపారు. 2025లో ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్‌లోకి రావాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. 2026 నాటికి అప్పులన్నీ తీరిపోయి సంస్థ లాభాల్లోకి అడుగుపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జెప్టో ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని.. రోజుకు వేల వస్తువులను 10 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్