‘వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టొద్దు’
AP: వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకుని వైసీపీ అక్రమాలకు పాల్పడిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధక్ అన్నారు. తిరిగి ఆ వ్యవస్థను ప్రవేశపెట్టొద్దని ఆయన డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు చెల్లించిన రూ.700 కోట్లను మాజీ సీఎం జగన్ నుంచి రాబట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. వాలంటీర్లకు డబ్బులు ఇచ్చి ప్రజాధనం వృధా చేస్తున్నట్లు గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.