ఉత్తర భారతాన్ని ఇవాళ ఉదయాన్నే భూకంపం వణికించింది. నేపాల్లోని లబుచే ప్రాంతానికి 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అక్కడ 6.35 గంటల ప్రాంతంలో భూమి కంపించగా, రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. అటు ఢిల్లీ, బిహార్లోని పట్నాతో పాటు కొన్ని జిల్లాల్లో ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. చైనా, బంగ్లాదేశ్, భూటాన్, టిబెట్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు తెలిసింది.