అమెరికాలోని నెబ్రస్కా సెనెటర్‌గా గెలిచిన డెబ్ ఫిషర్‌తో ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కమల పక్కన నిల్చొనేందుకు డెబ్ భర్త బ్రూస్ నిరాకరించారు. తర్వాత అయిష్టంగానే ఆమె పక్కన నిల్చున్నారు. చివరిలో ఉపాధ్యక్షురాలు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చూడగా ఆయన కనీసం స్పందించలేదు. దీంతో కమల ఇబ్బందిగా ఫీలయ్యారు.