తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 4 ఏళ్ళు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఖమ్మంలోని మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మంత్రిని శాలువాతో సన్మానించి పూల మొక్కను అందజేశారు. ఎన్నో దశాబ్దాలుగా ఇల్లందు ప్రజల చిరకాల కోరిక బస్ డిపో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.