
కొడుకుపై తండ్రి విచక్షణారహితంగా దాడి
ఏపీలోని ఏలూరు జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెంకు చెందిన శశి, పవన్ దంపతులు. వీరికి రాహుల్ అనే కొడుకు ఉన్నాడు. అయితే రాహుల్‌కు పవన్ సవతి తండ్రి. గత కొంతకాలంగా రాహుల్‌పై పవన్ విచక్షణారహితంగా దాడికి పాల్పడుతున్నాడు. కన్నతల్లి శశి ముందే ఛార్జర్ వైరుతో కొట్టడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి రాహుల్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.