కర్ణాటకలో షిర్సి తాలూకాలోని కాగేరి గ్రామంలోని ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే ఇంటి ఆవరణలో చిరుత పులి కలకలం రేపింది.ఇంట్లోకి ప్రవేశించిన చిరుత, కుక్కను పట్టుకోవడానికి యత్నించింది. అయితే కుక్కు దాని నుంచి తప్పించుకుంది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డవగా సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఇంటి ప్రాంగణాన్ని పరిశీలించారు. షిర్సి తాలూకా పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చిరుతలు దర్శనమివ్వడంతో చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.