ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో నిర్వహించనున్న రిపబ్లిక్ డే వేడుకలకు తెలంగాణ ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలకు ఆహ్వానం అందింది. బెజ్జూరు మండలం కుకుడ గ్రామానికి చెందిన పోర్తెటి శ్రీదేవి, కౌటాల మండలం కౌటీ అంగన్‌వాడీ కార్యకర్త ఎస్. జయంతి రాణికి ఆహ్వానం అందింది. స్వర్ణిమ్ భారత్ కార్యక్రమంలో భాగంగా పీఎం యశశ్వి స్కీం టెక్స్‌టైల్ (హ్యాండీ క్రాఫ్ట్స్) డబ్ల్యూసీడీ హ్యాండీ క్ట్రాఫ్ట్స్ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను కేటగిరిలో ఈ అవకాశం దక్కింది.