AP: సంక్రాంతి వేళ కోడి, పొట్టేళ్ల పందెలు, ఎడ్ల పోటీలు నిర్వహిస్తుంటారు. కానీ పందుల పోటీలు నిర్వహించడం మీరు ఎక్కడా చూసి ఉండరు. ప.గో జిల్లా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామ ప్రజలు మాత్రం సంక్రాంతి వేడుకలను విభిన్నంగా జరుపుకుంటారు. పందుల పోటీలు నిర్వహిస్తారు. మాజీ కౌన్సిలర్ సింగం సుబ్బరావు ఆధ్వర్యంలో పందుల పోటీలు జరిగాయి. గిరిజన సంప్రదాయంలో ఈ పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు చెప్పారు.