రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవాలని సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి

84చూసినవారు
AP: ‘పేదల ఇళ్ల స్థలాలు కబ్జా చేసిన రాజకీయ నేతలపై చర్యలు తీసుకోవాలి’ అని ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మూలుగుంటపాడులో ఇవాళ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయుబ్ ఖాన్ మాట్లాడుతూ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. తనను మతిస్థిమితం లేని వ్యక్తిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలికి వచ్చి నచ్చజెప్పడంతో ఆయన నిరసన విరమించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్