కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గోల్డెన్ అవర్‌లో ఆస్పత్రిలో చేరిస్తే ఇచ్చే రివార్డును కేంద్రం పెంచనుంది. ఉత్తమ పౌరులకు ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.25 వేలకు పెంచుతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కాగా, క్షతగాత్రులను గంటలో చికిత్స అందిస్తే వారు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని గోల్డెన్ అవర్ అంటారు.