AP: ఎన్టీఆర్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడ జాతీయ రహదారిపై మార్టూరు-చిలకలూరిపేట సమీపంలో బుధవారం అతివేగంగా వెళ్తున్న లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.