AP: రాష్ట్రంలో కోస్తా ప్రాంతాలను కలుపుతూ వెళ్లే కీలకమైన కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారికి విస్తరణ భాగ్యం దక్కింది. దీనిని 4, 6 వరుసలుగా విస్తరించేందుకు డీపీఆర్ తయారు చేయాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం ఈ రోడ్డు 2 వరుసలుగా ఉంది. 390 కి.మీ ఉండే ఈ రహదారిలో తొలుత కత్తిపూడి నుంచి మచిలీపట్నం బైపాస్ వరకు, రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేపడతారు.