పంట కోతల తర్వాత దుక్కి దున్నకపోతే కలిగే నష్టాలు

76చూసినవారు
పంట కోతల తర్వాత దుక్కి దున్నకపోతే కలిగే నష్టాలు
చాలా మంది రైతులు వానకాలం, యాసంగి పంట పండిన తరువాత తిరిగి వర్షాకాలం వచ్చే వరకు భూమిని దున్నకుండా వదిలేస్తారు. అలా చేయడం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమినిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమికి సత్తువ లేకుండా చేస్తాయి. ఫలితంగా భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు గ్రహించుకుని ఆవిరై పోయే ప్రమాదం ఉంది. అలాగే వదిలేయడంతో కలుపు మొక్కలు పెరిగి వాటి విత్తనాలు రాలి.. తదుపరి పంటకు నష్టాన్ని కలిగిస్తాయి.

ట్యాగ్స్ :