చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్

53చూసినవారు
కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం శుక్రవారం రాత్రి 7.30 గంటలకు చెన్నైలో కనువిందు చేసింది. నిశీధిలో మిలమిలా మెరుస్తూ కనిపించిన ఈ అరుదైన దృశ్యాన్ని చెన్నై వాసులు కెమెరాల్లో బంధించారు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారాయి. మే 8 నుంచి 23వ తేదీ మధ్య భారత్‌లోని పలు నగరాల్లో ఈ అంతరిక్ష కేంద్రం భూమి నుంచి కన్పిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది.

సంబంధిత పోస్ట్