‘లక్కీ భాస్కర్’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. దీపావళికి విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ తాజాగా పోస్ట్ పెట్టింది. ఈ నెల 28 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది.