అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మానపాడు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 29 మంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా 7లక్షల 62 వేల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.